Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం అమలు చేయాలి
- ఉద్యోగ భద్రత కల్పించాలి
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రరెడ్డికి సీఐటీయూ అధ్వర్యంలో ఐకెపీ, వీఓఏల వినతి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఏండ్ల కొద్ది పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని ఐకెపీ, వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకురాలు కవిత అధ్వర్యంలో ఐకేపీ వీఓఏలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రరెడ్డిని మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 17వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని డిమాండ్ చేశారు. వీఓఏలకు కనీస వేతనం రూ. 26 వేలు, రూ. 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. సెర్ప్ నుంచి ఐడీ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతి నెలా వేతనాలు వీఓఏల వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలన్నారు.