Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు స్కూళ్లలో జీరో రిజల్ట్
- 398 మందికి 86 మంది పాస్
- ఉపాధ్యాయుల కొరతే ప్రధాన కారణమని ఆరోపణలు
నవతెలంగాణ-మర్పల్లి
విద్యావ్యవస్థలో మొట్టమొదటిసారిగా మునుపెప్పు డూ లేని విధంగా పది ఫలితాలు మరీ అధ్వానంగా వచ్చా యి. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన పది ఫలితా ల్లో మండలం జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. మార్చి నెలలో ప్రభుత్వం నిర్వహించిన పదో తరగతి పరీక్షలు మం డలంలో 15 పాఠశాలలకు చెందిన 398 మంది విద్యా ర్థులు హాజరయ్యారని కేవలం 86 మంది విద్యార్థులు 22 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఒక ప్రయివేట్ పాఠ శాలకు చెందిన 5 విద్యార్థులు పరీక్ష రాయగా ఐదుగురు ఫెయిల్ అయ్యారు. మరో ప్రభుత్వ పాఠశాలలో పదిమం దికి 10 మంది ఫెయిల్ అయి జీరో ఫలితాలు నమోదు చేసుకున్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ చదు వుతున్న దామస్తపూర్కి చెందిన హారిక 9.2 ఉత్తీర్ణత సాధించి మండలంలో టాపర్గా నిలిచారు. గతంలో ఇంత అద్వానంగా ఫలితాలు ఎప్పుడూ రాలేదని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రభు త్వ పాఠశాలల్లో సదుపాయాలు ఉపాధ్యాయులు సక్రమం గా లేకనే రోజురోజుకు విద్యార్థుల సంఖ్యతో పాటు ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గిపోతుందని ఆరోపణలు ఉన్నార ుు. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఫెయిల్ కావడంతో తల్లి దండ్రులు ఆందోళనకు గురవుతున్నారు, ప్రభుత్వం ఇప్ప టికైనా ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధవహించి సదు పాయాలతో పాటు ఉపాధ్యాయులను నియమించి విద్యా ర్థుల బంగారు భవిష్యత్తును కాపాడాలని పలువురు కోరుతున్నారు.