Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు
- ఆందోళన చెందుతున్న వాహనాదారులు
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
- గోతిని వెంటనే పూడ్చాలని సర్పంచ్ డిమాండ్
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని మేడిపల్లి దాటిన తర్వాత నానక్ నగర్ దగ్గర రోడ్డు పక్కనే ప్రమాదకరంగా పెద్ద గోతి ఏర్ప డింది. ఈ విషయంపై నానక్ నగర్ సర్పంచ్ దంతుక పెద్ద య్య పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. మండల సర్వసభ్య సమావేశంలో ఈ రోడ్డు ప్రమాదం గురించి ఆ యన చర్చించారు. ఆర్అండ్ బి అధికా రులు మాత్రం పట్టిం చు కోకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని సర్పంచి మండిపడ్డారు. గతంలో ఈ గోతిని పూడ్చాలని అధికారులకు తెలియజేసిన పట్టిం చుకోకపోవడం సిగ్గుచేటని సర్పంచి విమర్శించారు. అసలే వర్షాలు కురుస్తున్న తరుణంలో రోడ్డు పక్కన ఏర్పడిన పెద్ద గోతి ప్రమాదకరంగా మారే అవకాశముందని సర్పంచ్ ఆం దోళన వ్యక్తం చేశారు. వాహనాదారులు ఏ ప్రమాదానికి గురవుతారోనని తెలిపారు. మేడిపల్లి నుంచి తాడిపర్తి వర కు నానక్‌నగర్ మీదుగా వాహనాదారులు ఎక్కువగా రాక పోకలు సాగిస్తుంటారని చెప్పారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు తక్షణమే స్పందించి ఏర్పడిన గోతిని పూడ్చా లని ఆయన డిమాండ్ చేశారు.