Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఏ.యాదిలాల్
- ఆమనగల్లో కొనుగోలు కేంద్రం సందర్శన
నవతెలంగాణ-ఆమనగల్
రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొను గోలు చేయాలని తెలుగుదేశం పార్టీ కల్వకుర్తి నియోజకవ ర్గం కో ఆర్డినేటర్ అండేకార్ యాదిలాల్ డిమాండ్ చేశారు. ఆమనగల్ మార్కెట్ యార్డు ఆవరణలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం స్థానిక నాయ కులతో కలిసి ఆయన సందర్శించారు. ధాన్యం అమ్మకానికి తెచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకు న్నారు. యాదిలాల్ మాట్లాడుతూ రైతు సంక్షేమ కార్యక్ర మాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యాన్ని వెంటనే తూకం వేసి వాటికి సంబంధించిన డబ్బులను వారం రోజు ల లోపు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన సూచిం చారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఖాదర్, వెంకటేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.