Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ అరవింద్‌రావు
నవతెలంగాణ-పరిగి
దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ అరవింద్‌రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మిట్ట కోడూరు, హిబ్రహీంపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ అరవింద్‌రావు ప్రారంభించారు. అనంతరం ఇబ్రహీంపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కనుక రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేడు ఎంతో మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. వారందరి కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ చేయించుకున్న వారికి అద్దాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మిట్ట కోడూరు సర్పంచ్ జయలక్ష్మి జగదీశ్వర్, ఇబ్రహీంపూర్ సర్పంచ్ కుమ్మరి నర్సమ్మ ఎంపీటీసీ గొట్లపల్లి పద్మమ్మ, మిట్ట కోడూరు గ్రామ ఉప సర్పంచ్ మల్లయ్య, ఏపీఎం శ్రీనివాస్‌రెడ్డి, సిసిలు మంగమ్మ, రాములు మాజీ సర్పంచ్ జగదీష్, జంగీర్, గ్రామ సంఘాల అధ్యక్షులు శామామ్మ, అలావేలు.వివోఎ లు రాములమ్మ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.