Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
సీఎం కప్ క్రీడా పోటీలు 15,16,17వ తేదీలలో నిర్వహించబడునని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య తెలిపారు. బుధవారం శంకర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంఈఓ, ఎంపీఓ, పిడిఎస్లతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రీడలకు మండలంలోని అన్ని గ్రామాల నుండి 15 నుంచి 36 సంవత్సరాలలోపు స్త్రీలు, పురుషులు పాల్గొనాలని సూచించారు. ఇందులో క్రీడలు అథ్లేటిక్స్ స్త్రీలు పురుషులు, ఫుట్‌బాల్ పురుషులు మాత్రమే, ఖోఖో స్త్రీలు, పురుషులు వాలీబాల్ స్త్రీలు, పురుషులకు ఉంటాయని తెలిపారు. పై క్రీడలకు సంబంధించి మండల స్థాయి కమిటీ చైర్మన్ గా ఎంపీపీ, జడ్పిటిసి మెంబెర్‌గా, కన్వీనర్‌గా ఎంపిడిఓ, సభ్యులుగా తహసీల్దార్, సీఐ, ఎంఈఓ, ఎంసి, పిడిఎస్ లు వ్యవహరిస్తారని తెలిపారు. ఈ క్రీడలకు ఇన్చార్జులు గాపాప గారి ఆశీర్వాదం,నరసింహులు ఉంటారని తెలిపారు. మండల స్థాయి క్రీడలు నిర్వహించాల్సిన స్థలం మండలంలోని మోకిలలోని రైతు వేదిక వద్ద క్రీడలను నిర్వహించడం జరుగుతుందని తలిపారు. క్రీడల్లో గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్స్, మోడల్స్ ఇచ్చి జిల్లా స్థాయికి పంపబడతారని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు సంప్రదించాల్సిన వివరాలు పి. ఆశీర్వాదం 9848416355, నర్సింలు 814274476 నంబర్లకు సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ సయ్యద్ అక్బర్, ఎంపీ ఓ గీతా, సూపరిడెంట్ రవీందర్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్టు నరసింహులు, ఉపాధ్యాయులు ఆశీర్వాదం, జయసింహారెడ్డి, తహర్ అలీ, తదితరులు ఉన్నారు.