Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పెంటనోళ్ల నరసింహ మాదిగ
- ఎమ్మార్పీఎస్, ఎమ్మేస్పి ఆధ్వర్యంలో కలెక్టరెట్ ముట్టడి
నవతెలంగాణ-షాద్నగర్
దళితబంధులో అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేల పేర్లను బహిర్గతం చేసి, వారిని పార్టీ నుండి బర్తరఫ్ చేయాలనీ ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పెంటనోళ్ళ నరసింహా మాదిగ అన్నారు. బుధవారం ఎమ్మార్పీఎస్, ఏమ్మెస్పి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పెంటనోళ్ళ నరసింహా మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కక్క యూనిట్ కి 3 లక్షల చొప్పున లంచం తీసుకున్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే చిట్టా నా దగ్గర ఉందని బిఆర్ఎస్ రాష్ట్ర స్ధాయి సదస్సులో కేసీఆర్ మాట్లాడటం జరిగిందని, కేసీఆర్ మాటలని హైకోర్ట్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత బంధులో అవినీతికి పాల్పడి లంచం తీసుకున్న మూడు లక్షలను తిరిగి దళితులకి ఇవ్వాలని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, దళితులకు డబుల్ బెడ్ రూమ్స్ పథకాలు ఎలా మూలకు పడ్డాయో దళిత బంధు పథకాన్ని సైతం మూలకు పడేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ తుడుం కిరణ్ మాదిగ,పోతుకంటి కృష్ణ మాదిగ,ఎమ్మెస్పి నియోజకవర్గ ఇన్చార్జి చినోళ్ళ ఆనంతయ్య మాదిగ, కొమ్ము మహేష్ మాదిగకడిగాళ్ల ప్రవీణ్ మాదిగ,కిరణ్ పూలే మాదిగ,చిర్రా శ్రీను మాదిగ తొట్ల శ్రీనివాస్ మాదిగ,మంద లింగం మాదిగ, శ్రీకాంత్ మాదిగ,అన్నేగాళ్ల ఆనంద్ మాదిగ, జగన్ మాదిగ, సురేష్ మాదిగ, వినోద్ మాదిగ, శ్రీకాంత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.