సినారె పుట్టినూరు హన్మాజీ పేట అల్లాడిపోతోంది సినారె చదువుకున్న ఊరు సిరిసిల్లా చిన్నబోతోంది
మాకు పేరుతెచ్చిన'కవి,బాపూ' ఇకలేడని.. తెలుగు అక్షరాలు తల్లడిల్లు తున్నాయి ప్రతి పుట్టినరోజున కొత్త పుస్తకానికి జన్మనిచ్చే మా " కవి బ్రహ్మ " ఇకలేడని.. తెలుగుభాష దీనంగా దిక్కులు చూస్తోంది తన' కలం గళం ' తో ఘన కీర్తి తెచ్చిన మా "మధుర కవి " ఇకలేడని.. తెలుగు చలనచిత్ర కళామతల్లి కలత చెందుచున్నది 'ఇగిరిపోని గంధమంటి' పాటలు అందించిన పదాలకు పరిమళం అద్దిన మా " కవి సినారె " ఇకలేడని.. సినారె సినీ గీతాభిమానుల హృదయం ఇప్పుడు పాడుతోంది విషాద గీతం సినీ గీతాలతో 'పగలే వెన్నెల 'కురిపించి పద సౌందర్యంతో పాటకు 'నిన్నలేని అందమేదో తెచ్చిన' మా "అభిమాన కవి " ఇకలేడని.. వర్ధమాన కవులు దిగులు చెందుచున్నారు అడిగినంతనే' కవితా సంపుటాలకు 'ముందు మాటరాసిన మా " ఆత్మీయ కవి " ఇకలేడని.. __బూర దేవానందం 9494996143. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా