నవతెలంగాణ-మంథని
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన బొగే రాజారాశీ శనివారం మృతి చెందాడు. ఆయన గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో 1965లో ఏప్రిల్ 14న జన్మించారు. ఆయన ఎస్.ఆర్ శంకరన్, కె.బాలగోపాల్, బొజ్జా తారకం,తదితర నాయకులతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాల్లో అంబేద్కర్ సంఘంలో సుపరిచితుడుగా నిబద్ధత కలిగిన నాయకులుగా,సుమారు మూడు దశాబ్దాలుగా సామాజిక పౌరహక్కుల ఉద్యమ నాయకులు గా పనిచేశారు. వైఎస్ ప్రభుత్వంలో జరిగిన నక్సల్స్ చర్చలను స్వాగతిస్తూ అంబేద్కర్ సంఘాల మద్దతు ప్రకటించారు. మహనీయుడైన అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపిన నాయకులుగా ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి అంబేద్కర్ సంఘాల నిర్మాణం లో కృషి చేశారు.రాజారాం భౌతిక దేహాన్ని స్వస్థలమైన గుంజపడుగు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.చి
ఉద్యమ నాయకులు రాజారామ్ లేకపోవడం బాధాకరం... ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
సీనియర్ అంబేద్కర్ వాది,దళిత బహుజన పౌరహక్కుల ఉద్యమ నాయకులు,అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోగే రాజారాం మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామని మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. రాజారాం కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన లేని లోటు దళిత సంఘాలకు,పేద ప్రజలకు తీరని లోటని అన్నారు.ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులతో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారని,తెలుగు రాష్ట్రాల్లో సామాజిక ఉద్యమాల కొనసాగింపులో ఆయన లేని లోటు తీర్చలేనిదని శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత సంఘాల నాయకుల సంతాపం...
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజారాం లేని లోటు ఎవరు తీర్చలేరని దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మంథని నియోజకవర్గం,ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుపరిచితుడైన రాజారాం.. దళితులకు,సామాజిక వర్గాలకు ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరన్నారు.
రాజకీయ పార్టీల సంతాపం...
తెలంగాణ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడిగా పని చేసిన భోగి రాజారాం లేని లోటు ఎవరు తీర్చలేరు అని మంథనిలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రజా ప్రతినిధులు పేర్కొంటూ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుపరిచితుడు గా పేరున్న రాజారామ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం ఆయన కుటుంబానికి దళిత ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:10PM