- "నవతెలంగాణ ఏఫేక్ట్"
- ప్రహారీ నిర్మాణ పనుల పరిశీలన
- అర్&బి డిఈ సుదిర్
నవతెలంగాణ - డిచ్ పల్లి
"నవతెలంగాణ "దిన పత్రికలో సోమవారం ప్రచురితమైన నాణ్యత నీ చిరునామా ఎక్కడ అనే వార్తకు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వెంటనే స్పందించి పనులను పరిశీలించి నివేదికను అందజేయాలని అర్ అండ్ బి శాఖ అధికారులను ఆదేశించారు. దానిలో భాగంగానే ఆర్ అండ్ బి డిఈ సుధీర్, ఎంపీడీవో రాములు నాయక్, ఆర్ అండ్ బి ఏ ఈ సత్యనారాయణ సోమవారం ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను సందర్శించారు. ఈ సందర్భంగా నవ తెలంగాణలో వచ్చిన కథనానికి రావారికి కూడా నిర్మాణ పనులలో నాణ్యత లోపాలు ఉన్నాయని పరిశీలించారు పలుచోట్ల భాయ్ వర్షాల కారణంగా వచ్చిన వరద నీటితో కొట్టుకుపోయిన ఫిబ్రవరి గోడను పరిశీలించి కాంట్రాక్టర్ను వెంటనే నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేసిన పనులకు గాను ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా ప్రత్యేక తీసుకుంటున్నామని ముందుగా అగ్రిమెంట్ ప్రకారమే పనులను చేస్తున్నామన్నారు పాఠశాల ఆవరణలోని మైదానంలో మొరం పనులకు గాను మన ఊరు మనబడి కింద మంజూరు కాలేదని గ్రామపంచాయతీ నిధుల నుండి మొరం వేయడం జరుగుతుందన్నారు కానీ ముందుగా ప్రహారీ గోడ నిర్మాణం పనులు పూర్తయిన తర్వాతనే మొరం వేసేది ఉండగా ముందుగా వేసేయడం జరిగిందని, ఇలా వేయించడం కరెక్ట్ కాదన్నారు. మూత్రశాలలు మరుగుదొడ్ల వద్ద వేసిన మొరం మైదానం నలువైపులా ఒక లేవల్తో వస్తుందని దాన్ని పైకి లేపి మరమ్మతులు చేపడతామని ఇదే కాకుండా ఇంకా రెండు మరుగుదొడ్లు మంజూరయ్యాయని వాటి స్థానంలో కొత్తగా నిర్మాణం చేపడతామన్నారు.
కాంట్రాక్టర్లకు డబ్బులు రాక పనులు చేయడానికి వేస్తున్నారని బిల్లులు చేసి పంపడమే తమ పనని డిఈ సుధీర్ పేర్కొన్నారు. నాణ్యత లేకుండా ఏ పనులు చేసిన దానికి బిల్లులు చెల్లించబోమని నిబంధనల ప్రకారమే పనులు చేయవలసి ఉంటుందని ఆయన అన్నారు. పాఠశాలలు తిరిగిన ప్రారంభమయ్యే లోపు మన ఊరు మన బడి కింద మంజూరైన పనులను త్వరత కట్టిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని ఎక్కడైనా నాణ్యత లోపిస్తే వారి బిల్లులను నిలుపుదల చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. పనుల వివరాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్కు అందజేయడం జరుగుతుందని మండలంలో ప్రస్తుతం మన ఊరు కింద కొనసాగుతున్న పనులను పర్యవేక్షిస్తూ జూన్ నెల 12 కల్లా పూర్తిగా పనులు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు పనుల్లో రాజి పడేది లేదని, నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే వారి బిల్లులను నిలుపుదల చేపడతామన్నారు. సర్పంచ్ పాశం సత్తెవ్వ నర్సింలు, ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ వీడీసీ చైర్మన్ నామాల గంగాధర్ తోపాటు తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 06:09PM