నవతెలంగాణ-ఏర్గట్ల
సీఎం కప్ మండలస్థాయి క్రికెట్ పోటీలు మంగళవారం తడపాకల్ గ్రామంలోని క్రీడా ప్రాంగణంలో ఎంపీపీ ఉపేంధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఈ పోటీలను ప్రవేశపెట్టారని ఇందులో మొదటగా మండలస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు పూర్ణానందం, ఎంపీటీసీ జక్కని మధుసూదన్, సర్పంచ్లు పత్తిరెడ్డి ప్రకాష్, కట్కం పద్మాసాగర్, కో-ఆప్షన్ సభ్యుడు అష్రాఫ్, ఎమ్మార్వో జనార్దన్, ఎంపీడీఓ రాజేశం, ఎంపిఓ శివ చరణ్, ఎంఈఓ ఆంధ్రయ్య, తాళ్ళ రాంపూర్ పీఏసీఎస్ చైర్మన్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి, తడపాకల్ ఉపసర్పంచ్ లోలపు అశోక్,పంచాయితీ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 05:30PM