- వినతి పత్రం అందజేసిన సిపిఐ(ఎం) నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ - అశ్వారావుపేట
మండలంలో పోడు సర్వే చేయకుండా నిలిపేసిన మల్లాయిగూడెం,వాగొడ్డుగూడెం,కోయ రంగాపురం పోడు భూముల్లో సర్వే చేసి అర్హులైన గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య తెలంగాణ ఉపరితల రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేసారు. స్థానిక వ్యవసాయ కళాశాల లో నూతనంగా నిర్మించిన వసతి గృహ సముదాయాన్ని ప్రారంభించడానికి సోమవారం వచ్చిన ఆయనను పార్టీ ముఖ్యనాయకులు తో కలిసి విన్నపం చేసారు.ఎన్నో ఏళ్ళుగా పోడు సాగుతో జీవనం చేస్తున్న గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్,మండల కార్యదర్శి చిరంజీవి తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 07:22PM