నవతెలంగాణ-వీణవంక
మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా వివాహాలు జరిగిన రెండు కుటుంబాలకు ఆ గ్రామ సర్పంచ్ పోతుల నర్సయ్య కల్యాణ కానుక అందజేశారు. గ్రామానికి చెందిన పోతుల రాజేశ్వరి-సుధాకర్ దంపతుల కుమార్తె శ్రీజ వివాహం రాజేంద్ర ప్రసాద్ తో జరిగింది. అలాగే బొంగోని రామనీల-శంకర్ దంపతుల కుమార్తె సంధ్య వివాహం రాజుతో జరిగింది. కాగా ఒక్కో కుటుంబానికి రూ.5వేల చొప్పున కల్యాణ కానుకగా రూ.10వేలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు వార్డ్ మెంబర్లు చింతల రాజయ్య, ఉగ్గి మమత-సమ్మయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్టవేన రాజయ్య, సీనియర్ నాయకులు పోతుల సురేష్, ఇట్టవేన సమ్మయ్య, కనకయ్య, వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్, పోతుల బాలయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 07:25PM