- ఏడు గంటలకే బానుడి భగభగలు
- అత్యధికంగా వీణవంకలో 45.8 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
- ఎండవేడిమితో అల్లాడుతున్న జనం
నవతెలంగాణ-వీణవంక
కరీంనగర్ జిల్లా వీణవంకలో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీణవంక మండలంలో 45.8 డిగ్రీలకు పైగా గరిష్ట ఉషోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి జిల్లా మంథని, పెద్దపల్లి జగిత్యాల జిల్లా సారంగపూర్, ధర్మపురి మండలంలోని జైనలో సైతం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల్లో మంథనిలో 45 డిగ్రీలకు పైగా ఉండటంతో ఆ ప్రాంతాలను రెడ్ అలార్ట్గా ప్రకటించనున్నారు. ఈ ఎండ తీవ్రత మరి కొద్ది రోజులు పెరిగే అవకాశం సైతం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జనం తీవ్రమైన ఎండవేడిమితో అల్లాడిపోయారు. ఎండల తీవ్రత ఎక్కవగా ఉన్నందున ప్రజలు ఎండ దెబ్బతగుల కుండా తగు జాగ్రతలు తీసుకొని బయటకు వచ్చి తమ పనులు చేసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
నిర్మాణుష్యంగా రోడ్లు..
విపరీతమైన ఉక్కపోత, దాహానికి తోడు వేడితో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది బయటకు రావటానికి జంకుతున్నారు. అత్యవసరమైతేనే బయటకు వచ్చి తమ పనులు చేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, రోడ్లు నిర్మాణుష్యంగా మారుతున్నాయి. దినసరి కార్మికులు, ఆటోకార్మికులు, రోడ్ల పక్కన పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులను అమ్ముకొని జీవించే చిరువ్యాపారులు విలవిలలాడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచే వ్యాపారాలు పూర్తిగా తగ్గిపోతున్నాయని, సాయంత్రం 5 గంటల వరకు వడగాలులు వీస్తుండడంతో ప్రజలు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
ఎండల తీవ్రత అధికంగా ఉండటంతోపాటు వడగాలులు వీస్తుండటంతో తప్పనిసరి అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. వడదెబ్బకు గురైతే వాంతులు, విరేచనాలతో పాటు తలనొప్పి, శరీరంలో ఉష్ర్ణోగ్రతలు పెరిగి ప్రాణహాని కలిగే అవకాశాలుంటాయని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచి స్తున్నారు. తప్పనిసరి బయటకు రావలసి వస్తే తలకు రుమాలు, టోపీ ధరించి జాగ్రత్తలు తీసు కోవాలని, పండ్ల రసాలను, మజ్జిగను అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే మంచినీటిని ఎక్కువగా తీసుకోవాలని, పలుచని వస్త్రాలను ధరించాలని, కాళ్లు చేతులు, ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కో వాలని సూచిస్తు న్నారు. ఒకవేళ ఎండ దెబ్బ తగిలినట్లయితే వెంటనే డాక్టర్ను సంప్ర దించా లని పేర్కొంటున్నారు. మరో రెండు నెలలు వేసవి ఎండల తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 07:19PM