నవతెలంగాణ - కంటేశ్వర్
నేడు అనగా 17 బుధవారం పాలిసెట్ 2023 పరీక్ష ఉందని నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ మంగళవారం తెలిపారు. కావున సంబంధిత ఎస్హెచ్ఓలు పోలీస్ సిబ్బంది అన్ని సెంటర్ల వద్ద పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేస్తూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలియజేశారు. మొత్తం పరీక్ష కేంద్రాలు 16 సెంటర్లు ఉండగా 16 కేంద్రాల చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిరాక్స్ షాపులను బంద్ చేసి ఉంచాలని పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని చెప్పారు. పరీక్ష 11 గంటలకు ప్రారంభం కాగా మధ్యాహ్నం ఒకటి గంటల 30 నిమిషాలకు అయిపోతుందని తెలిపారు కావున పరీక్షకు వచ్చే అభ్యర్థులు ఒక గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకుంటూ బాగుంటుందని సకాలంలో పరీక్ష రాసి ఇంటికి వెళ్లొచ్చని తెలియజేశారు కావున నిజామాబాద్ ఏసీపీ అన్ని పరీక్ష కేంద్రాలను ఎస్హెచ్ఓ లను ఎస్ఐలను ఎస్కార్ట్ సిబ్బందితో పర్యవేక్షణ చేయాలని ఆదేశాలను జారీ చేశారు. మొత్తం 16 సెంటర్లలో 6220 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు డిస్టిక్ కో ఆర్డినేటర్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. అభ్యర్థులు సమయపాలన పాటించాలన్నారు. పరీక్ష కేంద్రానికి వచ్చే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావద్దని కేవలం తమ హాల్ టికెట్ తో మాత్రమే రావాలని పాలిటెక్నిక్ పరీక్ష సంబంధించిన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నియమ నిబంధనలను అభ్యర్థులు ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 04:22PM