నవతెలంగాణ - భద్రాద్రి కొత్తగూడెం: 2022-23 సంవత్సరం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 16805 ఎకరాలలో ఆయిల్ పామ్ విస్తీర్ణ లక్ష్యం సాధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచింది అని కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేసారు. జిల్లాలో అత్యధికంగా 5 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం సాధించిన అశ్వారావుపేట క్లస్టర్ ఏ.ఈ.ఓ రాయుడు దుర్గారావు ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ అనుదీప్ అభినందించారు. అశ్వారావుపేట క్లస్టర్ ను ప్రధమ స్థానంలో నిలిపారని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న,వ్యవసాయ శాఖ ఏ డి అఫ్జల్ బేగం, ఉద్యాన శాఖ పర్యవేక్షకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm