నవతెలంగాణ-గోవిందరావుపేట
తెలంగాణ క్రీడ సంబురాలైన సీఎం కప్ క్రీడ పోటీలలో మండలం నుండి పలువురు ప్రోత్సాహకులు తమ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో రెండవ రోజు
సీఎం కప్ పోటీలను సీఎం కప్ క్రీడ మండలి చైర్మన్ మరియు ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ సీఎం కప్ క్రీడల్లో వాలీబాల్ కబడ్డీ కోకో విభాగాల్లో ప్రధమ బహుమతి సాధించిన జట్లకు ఒక్కో జట్టుకు 5000 రూపాయల చొప్పున 15 వేల రూపాయల ప్రోత్సాహకాన్ని మండలంలోని పసర పంచాయతీ రాంపూర్ గ్రామానికి చెందిన మెహర్ బ్రదర్స్ కాట్రగడ్డ సతీష్ కుమార్ సుధీర్ కుమార్ లు అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా పసర పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్సై సిహెచ్ కరుణాకర్ రావు తన వంతు క్రీడా స్ఫూర్తిగా ద్వితీయ బహుమతి వాలీబాల్ కబడ్డీ కోకో విభాగాలకు మూడు వేల రూపాయల చొప్పున ఒక్కో జట్టుకు ఇచ్చేందుకు 9000 రూపాయలు ప్రకటించడం జరిగిందన్నారు. అంతేకాక తృతీయ బహుమతిగా వాలీబాల్ కబడ్డీ కోకో జట్లకు ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున 6, రూపాయల ప్రోత్సాహకాన్ని అందించేందుకు మండల స్పెషల్ ఆఫీసర్ మరియు డి ఆర్ డి ఓ నాగ పద్మజ ముందుకు రావడం అందరం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఇంకా ఎవరైనా క్రీడా స్ఫూర్తితో ముందుకు వచ్చినట్లయితే తమ పేర్లను వేదిక వద్ద నమోదు చేయించుకోవాలని సూచించారు. నగదు క్రీడా ప్రోత్సాహకాలను ప్రకటించిన వారందరికీ శ్రీనివాసరెడ్డి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 07:30PM