నవతెలంగాణ-భిక్కనూర్
అనాధ కుటుంబానికి కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అండగా నిలిచారు. ఆదివారం మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన అనాధ మహిళకు పదివేల రూపాయలు పంపించారు వాటిని స్థానిక నాయకులు ఆమెకు అందజేశారు. గ్రామానికి చెందిన మన్నెమ్మ భర్త చనిపోయి అనాధగా జీవిస్తున్నారు. ఇటీవల గ్రామానికి వచ్చినా ఎమ్మెల్యే గోవర్ధన్ దృష్టికి ఆమె పరిస్థితిని స్థానిక నాయకులు వివరించగా తక్షణమే స్పందించిన ఆమె కుటుంబాన్ని ఆదుకుంటానని ఆమెకు 10,000 రూపాయలు పంపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సులోచన సుదర్శన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ లింగాల కృష్ణ గౌడ్, ఉప సర్పంచ్ సిద్ధా గౌడ్, మండల కోఆప్షన్ సభ్యురాలు సుల్తానా, వీరేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బాపురెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్, గ్రామ అధికార పార్టీ అధ్యక్షులు బాలకిషన్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఆకుతోట భాగ్య, సొసైటీ డైరెక్టర్ రాజసింహారెడ్డి, మాజీ సర్పంచ్ భూపతి, నాయకులు జీవన్ రెడ్డి, మురళి, నీలం రెడ్డి, మల్లారెడ్డి, రాములు, శివానందం గౌడ్, సిద్ధిరాములు, రాజిరెడ్డి, రామస్వామి, రాజవ్వ, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 08:01PM