నవతెలంగాణ - తాడ్వాయి
రెండవ రోజు ఘనంగా సీఎం కప్ క్రీడలు ముమ్మరంగా జరిగాయి. కబడ్డీ క్రీడలను ఎంపీపీ గొందివాన శ్రీ ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్యలు ప్రారంభించారు. హోరా హోరీగా కబడ్డీ క్రీడలు ముమ్మరంగా సాగాయి. ప్రధమ బహుమతి గెలుపొందిన కబడ్డీ తాడ్వాయి టీం కు, ద్వితీయ బహుమతి గెలుచుకున్న దామెర్వాయి టీం క్రీడాకారులకు షీల్డ్ లు సర్టిఫికెట్లు మొదటి స్థానం గెలిచిన వారికి 2000 రూపాయలు రెండవ స్థానం గెలిచిన టీంకు 1500 రూపాయల నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందని, ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ టోర్నీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క యువ ఆటగాడు ఈ క్రీడలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చిరంజీవి, ఎంపీఓ శ్రీకాంత్, ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)లు మదన్మోహన్ గడ్డం లక్ష్మీనారాయణ, తోలెం సమ్మయ్య, మంకిడి స్వామి, సునీత, పుష్పలత, సతీష్, మున్వర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 07:25PM