నవతెలంగాణ కంటేశ్వర్
విద్యారంగ సమస్యలపై నిరంతరం ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి తెలిపారు. ఈ మేరకు ఆదివారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రయివేటు కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ లు డొనేషన్లు వసూలు చేస్తే ఎస్ఎఫ్ఐగా ఉద్యమాలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి మాట్లాడుతూ, ప్రయివేటు కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉద్యమం తప్పదంటు హెచ్చరించారు అడ్మిషన్ కోసం టెస్టులు పెట్టడం కూడ నిబంధనలకు విరుద్ధమని అన్నరు వీటితోపాటు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలకు ముందస్తుగా పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ అందించాలని,అదేవిధంగా మధ్యాహ్న భోజన చార్జీలను పెంచి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి విద్యా సంవత్సరం ప్రారంభానికి ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు హాస్టళ్లకు పెంచినటువంటి మేస్చార్జీలు అమలు అయ్యే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బోడ. అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు మహేష్ , నాగరాజ్, సహయ కార్యదర్శి దిపిక, జిల్లా నాయకులు జోహర్సింగ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 08:59PM