నవతెలంగాణ కంటేశ్వర్
హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో 'అమృతలత- అపురూప పురస్కారాలు - 2023' ఆదివారం ఘనంగా జరిగాయి.సాహిత్యానికీ, ఇతర లలితకళలకూ దూరమవుతున్న యువతరాన్ని వాటిపట్ల ఆసక్తి, అనురక్తి కలిగించాలని, వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన నిష్ణాతులైన స్త్రీ మూర్తులను గౌరవించాలన్న సదుద్దేశంతో ఈ అవార్డులను నెలకొల్పటం జరిగిందని అమృతలతో వివరించారు.అతిథులు, అవార్డు గ్రహీతలకు సంబంధించిన పరిచయాలతో కూడిన 'అభినందన' పుస్తకం అతిథులచేఆవిష్కరింపబడింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ డా.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ..అనీ, అమృతల జీవన సాఫల్య పురస్కారాల ప్రదాత డా. అమృతలత, అపురూప అవార్డ్స్ ప్రదాతలైన ఆమె కుటుంబ సభ్యులు అభినందనీయులని అన్నారు. విశిష్ఠ అతిథిగా విచ్చేసిన కేంద్రసాహిత్య సలహామండలి కన్వీనర్ డా.సి. మృణాళిని మాట్లాడుతూ..అమృతలతో జీవన సాఫల్య పురస్కారాలను 'అమృతలత జీవన సాఫల్య' పురస్కారాలను 'నవలారచన' విభాగంలో గంటి భానుమతి, 'విద్యారంగం'లో డా. పి. విజయలక్ష్మి పండిట్, 'సినీరంగం'లో సంగీత, శాస్త్రీయ సంగీతం'లో ద్వారం లక్ష్మిగార్లు ఒక్కొక్కరూ ఇరవై ఐదువేల రూపాయలను చెక్స్ రూపంలో అందుకున్నారు.
అపురూప' పురస్కారాలను మాణిక్యేశ్వరి (సినీ జర్నలిజం), ఆలపాటి లక్ష్మి (రంగస్థలం), మందరపు హైమవతి (కవిత్వం), మహెజబీన్ (మహిళాభ్యుదయం), జ్యోతి వలబోజు (పుస్తక ప్రచురణ), శైలజామిత్ర (సాహితీ విమర్శ), డా.కె.రత్నశ్రీ (శాస్త్రీయనృత్యం), డా.కె.యన్. మల్లీశ్వరి (కథారచన), పి.జ్యోతి (వ్యాసరచన) విభాగాలలో ఒక్కొక్కరూ పది వేల రూపాయలు అందుకున్నారు.మానసిక వికలాంగుడైన నాగదీప్ చేసిన నృత్యం, విజయ్ హైస్కూల్, నిజామాబాదు ఉపాధ్యాయినీ బృందం చేసిన 'యమునా తీరమున / నీలమోహన' నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆహూతులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ అనంతరం.సుశీల నాగరాజు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 08:32PM