- జడ్పీ వైస్ చైర్మన్ నాగజ్యోతి, ఎంపీపీ వాణిశ్రీ
- ఘనంగా సీఎం కప్ క్రీడలు ప్రారంభం
నవతెలంగాణ - తాడ్వాయి
ప్రతిభ కలిగిన ప్లేయర్లను (క్రీడాకారులను) ప్రోత్సహించేందుకు సీఎం కప్ టోర్నీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు ములుగు జడ్పి వైస్ చైర్మన్ నాగజ్యోతి, ఎంపీపీ గొంది వాణిశ్రీలు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో స్థానిక తాసిల్దార్ ముల్కనూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపీడీవో సత్య ఆంజనేయ ప్రసాద్ అధ్యక్షతన సీఎం కప్ క్రీడలను ప్రారంభించారు. అందులో భాగంగా మండల వ్యాప్తంగా 16 వాలీబాల్ టీములు రాగా, వాలీబాల్ ఆటలు ముగిశాయి. ప్రధమ బహుమతి గెలుపొందిన వాలీబాల్ అంకంపల్లి టీం కు, ద్వితీయ బహుమతి నర్సాపూర్(పిఏ) టీం క్రీడాకారులకు బహుమతులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీడ వేస్తుందని, ప్రతిభ కలిగిన పేర్లను ప్రోత్సహించేందుకు నేటి (ఈనెల 15) నుంచి 31 వరకు మండల జిల్లా రాష్ట్రాల్లో సీఎం పేరుట టోర్నీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మట్టిలో మాణిక్యాలు వెలికి తీసేందుకు ఇప్పటికే గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసి, ఈ టోర్నీలో 15 - 36 ఏళ్లలోపు పురుషులు, మహిళలు పాల్గొనేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. జరుగుచున్న సీఎం కప్ టోర్నీ క్రీడలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి యాప సాంబయ్య, ఎంపీఓ శ్రీకాంత్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లయ్య, సర్పంచ్ జాజ చంద్రం, నాయకులు పులుసం పురుషోత్తం, ఎంపిటిసి నాలి సుమలత రమేష్, మాజీ మండలాధ్యక్షుడు రమేష్, ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)లు మదన్మోహన్ గడ్డం లక్ష్మీనారాయణ, తోలెం సమ్మయ్య, మంకిడి స్వామి, సునీత, పుష్పలత, సతీష్, మున్వర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 08:09PM