- గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ను కలిసిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దినేష్ కుమార్ కులాచారి..
నవతెలంగాణ - డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డి రవిందర్ గుప్తా అవినీతి వ్యవహారాలు, అక్రమాలపై, యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమ నియామకాల పై రిటైర్డ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరపాలని కోరుతూ సోమవారం ప్రత్యేకంగా కలిసి గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కు సమస్యలతో కుడిన వినతి పత్రాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నిజామాబాద్ రూరల్ ఇంచార్జీ కులచారి దినేష్ కుమార్ అధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లో గవర్నర్ ను కలిసి అందజేశారు. యూనివర్సిటిలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ అన్ని విషయాలు విన్న తర్వాత సానుకూలంగా స్పందించినట్లు దినేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పద్మా రెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్, వైస్ ఎంపిపి శ్యామ్ రావు, మండల అధ్యక్షులు వెంకటరమణ, ఏస్సీ మోర్ఛ జిల్లా ఉపధ్యక్షులు ప్రతాప్, జిల్లా ఐటీ సెల్ కో కన్వీనర్ నవీన్ కుమార్ ఉల్లెంగ, చంద్ర కాంత్, చౌకీ విష్ణు, విద్యార్థి నాయకులు గజెందర్, నవీన్, సాయికుమార్, సాయికృష్ణ మల్లికార్జున్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 06:14PM