నవతెలంగాణ కంటేశ్వర్
మానవజీవన మనుగడకు సృష్టిమూలమైన అమ్మ, జగతి ప్రగతికి తొలిసంతకంగా నిలుస్తున్నదనీ, అమ్మను గౌరవిస్తే అన్నీ విజయాలే అనీ, ఇందూరు కవులు , అమ్మ మీద కవిసమ్మేళనం నిర్వహించి కవితానీరాజనం పలికినారనీ, వీరు అభినందనీయులనీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసరు డా.త్రివేణి ముఖ్య అతిథులుగా హాజరై అన్నారు. ఆదివారం నాడు ఇందూరుయువత స్వచ్చందసేవా సంస్థ ఆధ్వర్యంలో మాతృదినోత్సవం సందర్భంగా కవిసమ్మేళనం సంస్థ కార్యాలయం లో నిర్వహించారు.సంస్థ అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు ఆధ్వర్యం లో జరిగిన,ఈ సభకు ముఖ్యతిథిగా వచ్చిన డాక్టర్ ప్రతిమారాజ్ మరియు త్రివేణి మాట్లాడుతు.. కవుల నవసమాజ నిర్మాతలనీ, విలువలతో కూడిన సంఘాన్ని తయారు చేస్తారనీ, మాతృమూర్తి మాతృభాష మాతృదేశం అనే భావనలు చాలా గొప్పవనీ, వీటిని నిరంతరం కవులు అందించాలన్నారు. సభాధ్యక్షులుగా వసంతలక్ష్మణ్
విశిష్ట అతిథులుగా పద్మావతి, షేర్ల సుజాత, విజయలక్ష్మి పాల్గొని ప్రసంగించారు. ఈ కవిసమ్మేళనం లో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ సలహాదారులు , కవి డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, సిర్ప లింగం, బాలిష్ట్ మల్లేశ్ , మల్లవరపు చిన్నయ్య,దారం గంగాధర్ , శ్రీమన్నారాయణచారి, , చెన్న శంకర్, పురం శంకర్, రామేశ్వర్ రెడ్డి, తొగర్ల సురేశ్ , దారం గంగాధర్, అర్సపల్లి రాధ తదితరులు పాల్గొని తమ కవితలలో అమ్మకు నీరాజనం పలికారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 09:26PM