నవతెలంగాణ - హుస్నాబాద్ రూరల్
గౌరవెల్లి ప్రాజెక్టు పనులను పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం గౌరవెల్లి ప్రాజెక్టు పై విషం చిమ్ముతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కరువు కాటకాలతో బీటలు పారిన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలం చేయాలని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎంతో కృషి చేస్తున్నాడని అన్నారు. లక్ష ఎకరాలకు నీళ్లు అందించే దిశగా గౌరవెల్లి పనులను శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటుంటే రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రాజెక్టు పనులను ఆపాలని చూడడం సిగ్గుచేటని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 06:12PM