నవతెలంగాణ-భిక్కనూర్
రాష్ట్ర ప్రభుత్వం వివోఏల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని బిక్నూర్ పట్టణ కేంద్రంలో మండల వివోఏల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతన చట్టం 26 వేల రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు. 10 లక్షల రూపాయల సాధారణ, ఆరోగ్య భీమా, ఎస్ హెచ్ జి సభ్యులకు అభయ హస్తం డబ్బులు తిరిగి చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న వడ్డీ లేని రుణాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వివో ఏలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 06:18PM