నవతెలంగాణ - అశ్వారావుపేట
నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలం అల్లి గూడెం ఆదివాసి గిరిజన గ్రామంలో కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో యాత్రను మంగళవారం ఆ పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ సభ్యురాలు,ములకలపల్లి జెడ్.పి.టి.సి సున్నం నాగమణి మాట్లాడారు.రాహుల్ గాంధీ సందేశాన్ని కరపత్రాలు రూపంలో గడప గడపకు పంచడం మే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రైతులకు రూ. 2 లక్షలు రుణమాఫీ,పోడు భూములకు హక్కు పత్రాలు, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి రూ.5 లక్షలు, ధరణి పోర్టల్ రద్దు, ఆరోగ్య శ్రీ పథకం రూ. 5 లక్షలు,రేషన్ షాపుల్లో 9 రకాల నిత్యవసర సరుకులు,ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి ఎకరానికి రూ. 15 వేలు, అన్ని పంటలను గిట్టు బాటు ధరలతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు, కొరస బాబురావు, మొడియం ధర్మరాజు, మొడియం గోపాలస్వామి, నారం జ్యోతి, కొరస గీత, కొరస సూర్యచంద్రరావు, మొడియం జయ కుమార్, కొరస రోహిత్, కొరస రాహుల్, మొడియం రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 07:24PM