నవతెలంగాణ - కోహెడ
రైతులు పచ్చి రొట్ట ఎరువులను వాడి పంటలను పలు రోగాల భారిన పడకుండా కాపాడుకోవాలని ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పచ్చి రొట్ట ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని రైతుబంధు కోఆర్డినేటర్ పెర్యాల రాజేశ్వర్‌రావు, ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువులు వరికోతల అనంతరం తడి పొలంలో వెదజల్లి పూతదశకి 45 రోజుల తర్వాత పొలంలో కలియ దున్నడంతో భూమిలో నత్రజని శాతం పెరిగి భూమి సారవంతం అవుతుందన్నారు. అలాగే యూరియ వాడకాన్ని ఎకరానికి సుమారు 35 కిలోల వరకు తగ్గించుకోవచ్చునన్నారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు పచ్చి రొట్ట ఎరువులను సద్వినియోగం చేసుకొని పంట దిగుబడిని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వం రూ.843లకే ఇవ్వడం జరుగుతుందని సుమారు రెండున్నర ఎకరాలకు సరిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్, ఏఈవోలు శివకుమార్, మహిపాల్, సాయిక్రిష్ణ, బస్వాపూర్ వీసీవో సురేష్, తదితరులు పాల్గోన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 06:21PM