నవతెలంగాణ - కంటేశ్వర్
నిజాంబాద్ నగర ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని 41వ డివిజన్ లో సుమారు 10 లక్షల రూపాయల నిధులతో చంద్రశేఖర్ కాలానీ లోని ప్రభుత్వ పాఠశాల వెనకాల సీసీ రోడ్డు వేయుటకు అలాగే సెయింట్ పాల్ స్కూల్ వెళ్లే దారిలో 3లక్షల నిధులతో డబ్ల్యూ. బి యమ్ రోడ్డు వేయుటకు, 45వ డివిజన్ శ్రీనగర్ కాలనిలో 10లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించినట్లు మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ తెలిపారు. ఈ సందర్బంగా మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ మాట్లాడుతూ.. నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని పార్టీలకు అతీతంగా గౌరవ ఎమ్మెల్యే నిధులను కేటాయిస్తూ నగర అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు.అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులకై కృషి చేస్తున్న ఎమ్మెల్యే కి కార్పొరేటర్ల తరుపున నగర ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఇందిర, ఆకుల హేమలత, తెరాస నాయకులు చంగుబాయ్, అహ్మద్, శ్రీనివాస్, శివ చరణ్, మున్సిపల్ ఇంజనీర్ పావని, ఆదికారులు, నాయకులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 04:31PM