నవతెలంగాణ-కోహెడ
మండల కేంద్రంలోని అంగడి బజార్ సమీపంలో నూతన భవనాలను అద్దెకు ఇచ్చేందుకు నేడు వేలం నిర్వహించనున్నట్లు ఆదివారం సర్పంచ్ పెర్యాల నవ్య దేవెందర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ 12 నూతన షెటర్లను కిరాయికి ఇచ్చేందుకు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ వేలంలో పాల్గోనేవారు గ్రామ పంచాయితిలో ఎలాంటి బకాయిలు ఉండరాదని సూచించారు. అలాగే రూ.15 వేల నగదు లేదా డీడీని తీసి గ్రామపంచాయితిలో సమర్పించాలన్నారు. వేలంలో దక్కించుకున్న వారు నాలుగవ వంతు రూపాయలను వెంటనే చెల్లించాలన్నారు. దీనికి గాను రెండు సంవత్సరాల కాలపరిమితి ఉంటుందని తెలిపారు. ఆసక్తి గలవారు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 08:07PM