- కనీస గుర్తింపును ఇవ్వండి
- మంత్రికి వినతి పత్రం అందజేసిన సిఐటియు నాయకులు అర్జున్
నవతెలంగాణ - అశ్వారావుపేట
గ్రామస్థాయిలో మహిళల ఆర్ధిక స్వావలంబన కు కృషి చేస్తున్న వీవోఏ లను ప్రభుత్వం పరంగా కనీసం గుర్తింపు అయినా ఇవ్వాలని సిఐటియు అనుబంధ వీవోఏ లు తరుపున జిల్లా నాయకులు అర్జున్ తెలంగాణ ఉపరితల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేసారు. స్థానిక వ్యవసాయ కళాశాలలో నిర్మించిన నూతన బాలికలు వసతి గృహాన్ని ప్రారంభించడానికి సోమవారం ఆయన అశ్వారావుపేట వచ్చిన సందర్భంగా గత నెల రోజులుగా సమ్మె చేస్తున్న వీవోఏ లు మంత్రిని కలిసి వారి సమస్యలను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణ కుమారి, భాగ్య లత, షాహీనా,పార్వతి, సరిత, లలిత, జ్యోతి ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 07:34PM