నవతెలంగాణ కంటేశ్వర్సీసీ
ఈ నెల 27న భారత్ బంద్ జయప్రదం చేయాలని వ తేదీ న ఏ ఐ కె ఎస్ సి సి ఆధ్వర్యంలో శనివారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి నిజామాబాద్ నగరం మొత్తం బైక్ ర్యాలీ నిర్వహించారు. బంద్ ను విజయవంతం చేయాలని ప్రజలను కోరుతూ, నినాదాలు ఇస్తూ ప్రచారం చేసింది. ఈ బైక్ ర్యాలీకి సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీతో పాటు బీజేపీ, టిఆర్ఎస్ మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలియజేస్తూ ర్యాలీలో పాల్గొన్నాయి. అనంతరం టి ఎస్ ఆర్ టి సి ఆర్ ఎమ్ కు బందుకు సహకరించాలని నగరంలోనీ చాంబర్ ఆఫ్ కామర్స్, కూరగాయల మార్కెట్, రిటైల్ వ్యాపారం, శ్రద్ధానంద గంజ్, షాపింగ్ మాల్స్ కు ల వారికి వినతి పత్రాలు ఇచ్చాం. ఈ ర్యాలీ లో లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, సిటు జిల్లా ఉపాధ్యక్షులు ఎం గోవర్ధన్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్, మహేష్, ఇఫ్ట్ నాయకులు ఎం సుధాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమన్న, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి సుధాకర్, జె ఏ సి చైర్మన్ యం. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
బైక్ ర్యాలీ సందర్భంగా గా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ద వెంకట్ రాములు, ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ.... కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ది. ఒకపక్కన అధిక ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. ఐదు సంవత్సరాలు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని మాయ మాటలు చెబుతున్నారని.. ఐదు సంవత్సరాలకు సరిపడా ఉంటే దేశ ప్రజలందరికీ ఐదు సంవత్సరాల పాటు నెలకు యాభై కిలోల బియ్యం ప్రతీ కుటుంబానికి ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నించారు. అలా ఇస్తే గోదాముల్లో ముక్కి మూలుగుతున్న బియ్యం ప్రజలకు ఆహారం గా మారుతుంది. మళ్ళీ బియ్యం అవసరం ఏర్పడుతుంది. రైతాంగం పంటలు వేసి మళ్లీ పంటలు పండిస్తారు. దానికి గిట్టుబాటు ధర కూడా అందుతుంది. కానీ, కేవలం కార్పొరేట్ సంస్థలైన అంబానీ, ఆదానీ లకే కట్టబెట్టే చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకని మోడీ తన విధానాన్ని మార్చుకోవాలని 27 తారీకు ఏ ఐ కె ఎస్ సి సి ఇచ్చిన భారత్ బంద్ విజయవంతం చేయాలని జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:33PM