నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలను ఆదివారం అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో, పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం గోవిందరావుపేట. కార్యాలయమునందు చాకలి ఐలమ్మ జయంతిని సర్పంచ్ శ్రీమతి లావుడ్య లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా చాకలి ఐలమ్మ నైజాం కి ఎదురొడ్డిన ధీరురాలు,వీరనారి అని కొనియాడారు. అదేవిధంగా పరిసర పంచాయతీలో సర్పంచ్ ముద్దబోయిన రాము ఆధ్వర్యంలో వీరనారి ఐలమ్మ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
కార్యక్రమంలో ఉపసర్పంచ్ అల్లంనేనీ హనుమంత రావు,. బద్దం లింగారెడ్డి జూనియర్ సహాయకులు రంజిత్ కుమార్, 9వార్డు సభ్యులు మొహ్మద్ అన్వర్,11వ,వార్డు సభ్యులు తుమ్మల శివ,గ్రామస్థులు కీర్తి రవి,లావు డ్య జోగ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Sep,2021 03:40PM