నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని పంభాపూర్ గ్రామానికి చెందిన జూనియర్ అసిస్టెంట్ అర్రెం నర్సయ్య గారి తల్లి సారక్క దశదినకర్మకు సోమవారం ములుగు జిల్లా ఎన్పీడీసీఎల్ డిఇ పులుసం నాగేశ్వరరావు, టీఎస్ యుటిఎఫ్ ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఈసం బుచ్చయ్య, జిసిసి డైరెక్టర్ పురుషోత్తం, ఉపాధ్యాయ సంఘం నాయకులు కుంజ పగడయ్య, మాజీ సర్పంచ్ పోలేబోయిన కృష్ణ, మేడారం మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నాలి కన్నయ్య, ఎంపీటీసీ నాలి సుమలత రమేష్ లు హాజరై వారి కుటుంబాన్ని పరామర్శించారు. జూనియర్ అసిస్టెంట్ నరసయ్య తండ్రిగారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ నెంబర్ దిలావర్ ఖాన్, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు, ఆదివాసిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 05:50PM