- సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి సాగర్
నవతెలంగాణ కంఠేశ్వర్
మతోన్మాదా విధానాలపై నికరంగా పోరాడినప్పుడే ప్రజాస్వామ్యం మనవడ సాగుతుంది అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి సాగర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్
జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తీగల సాగర్, పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలలో అనైక్యతను సృష్టించి సమస్యలను పక్కనపెట్టి మత ఉద్రిక్తకలను రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కొరకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు ఏపీ పార్లమెంట్ సభ్యుడు బ్రిజ్ భూషణ్ పైన ఆ రూపంలో వస్తున్నప్పటికీ ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోగా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష పార్టీల నాయకుల పైన లోపర్చుకోవటానికి ఈడీ దాడులు ఇన్కమ్ టాక్స్ దాడులు సిబిఐ దాడులకు ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేసి తనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉన్నారని అన్నారు.! బిజెపి అనుసరించే ప్రజావ్యతిరేక మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించటానికి పార్టీ సర్వశక్తులు వండాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ శ్రమ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్రాముల,నూర్జహాన్ కామారెడ్డి జిల్లా నాయకులు మోతిరామ్, సురేష్ గుండా ,జిల్లా కమిటీ సభ్యులు పిసూరి, సుజాత మరియు అనిల్ మహేష్ తదితరులతోపాటు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 05:57PM