నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే సీతక్క హనుమాన్ స్వాముల నగర సంకీర్తనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ హనుమాన్ స్వాముల దీక్షలు పలప్రదం కావాలని, మాల ధారణ మొదలుకొని మాల విరమణ వరకు స్వాములు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజలు పాడిపంటలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో కలకాలం చల్లగా ఉండాలని స్వాములు ఆశీర్వదించాలని అన్నారు. హనుమాన్ స్వాముల దీక్షలో ఎంతో నియమ నిష్ఠలు వారి వాక్కులకు ఎంతో శక్తి ఉంటుందని అన్నారు. వారి ఆశీర్వాదం సమాజానికి మేలు కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాముల తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 05:58PM