నవతెలంగాణ,డిచ్ పల్లి:ముఖ్యమంత్రి కెసిఆర్ 2020 లో కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్న సందర్భంగా విఅర్ఓ వ్యవస్థను రద్దు చేసిన సందర్బంలో నిండు అసెంబ్లీ సాక్షిగా స్వయానా ముఖ్యమంత్రి విఅర్ఏలకు పే స్కేల్, అర్హత కలిగిన వి.ఆర్.ఏ లకు పదోన్నతులు, 3.55 సంవత్సరాలు దాటినా వి.ఆర్. ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారని కాని నేటికి రెండున్నరేళ్ళు గడిచిన అమలుకు నోచుకోలేదని విఆర్ఏ సంఘం అధ్యక్షులు నీరడి గంగాధర్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది జూలై 25న నిరవదిక సమ్మె చేశామని, అయిన ప్రభుత్వం స్పందించలేదన్నరు. మంత్రి కెటిఆర్ చర్చలకు పిలిచి త్వరలో మీ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. అయినా ఇప్పటి వరకు ఏ సమస్య కూడా తీర్చలేదన్నారు. సమ్మె విరమించి నేటికి 7 నెలలు అవుతుందని,దీనికి నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు ధర్నా చేయడం జరుగుతుందన్నారు.దీనిలో భాగంగా డిచ్పల్లి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరిగిందని తెలిపారు.ఇక నైనా ప్రభుత్వం మా సమస్యలు అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుతున్నమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దండు సూర్య రాజ్, తొండకురి నర్సయ్య, తలారి మోహన్, భాగ్యం మండల విఅర్ఏ లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm