నవతెలంగాణ కంటేశ్వర్
నిజాంబాద్ నగరంలోని ఆరో పలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. ఎస్సై సాయి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం అనగా 12.05.2023 న ఉదయం 9 గంటలకు, డ్రైవర్స్ కాలనీకి చెందిన తబస్సు కణం, వయస్సు 16 సంవత్సరాలు, విద్యార్థిని, తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలను ఆరో పోలీస్ స్టేషన్ ఎస్.ఐ సాయికుమార్ వెల్లడించారు. చనిపోవడానికి కారణమేమనగా తేదీ 08.05.2023 నాడు రాత్రి 8 గంటలకు కాలంలో గల కిరాణా షాప్ కు వెళ్ళినది. అక్కడ తనకు తెలిసిన అల్తాఫ్ అనే అబ్బాయి కలవడంతో అతనితో బైక్ పై కూర్చున్నది. అది గమనించిన అల్తాఫ్ అదే కాలనీకి చెందిన అబ్బాయి ఆమెర్ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పడంతో అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని మందలించారు. అంతేకాకుండా అబ్బాయితో బైక్ పై ఎక్కిన విషయం కాలనీలో తెలిసిందని దాంతో కాలనీ వారు ఏమనుకుంటున్నారు అని మనస్థాపంతో తన ఇంట్లో ఉదయం ఉరివేసుకొని చనిపోయినది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఆరవ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ సాయికుమార్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 07:53PM