- ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్
నవతెలంగాణ కంటేశ్వర్
రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ కోసం దరఖాస్తు చేసుకోండి అని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వరదబాటు వేణు రాజు తెలియజేశారు. సంచలనాత్మక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువశక్తిని మేల్కొల్పే దిశగా జూన్ 2 ను నిర్వహించే రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ కోసం నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల యువతీ, యువకులు, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాదులో ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రే, తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు, పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఎన్.ఎస్.యు.ఐ జాతీయ అధ్యక్షుడు నీరజ్ కుందాన్, ఎన్.ఎస్.యు.ఐ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ అక్షయ్ లక్రా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ పాల్గొని ద్వారా రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ కు సంబంధించి వివరాలను తెలియజేయడం జరిగింది.సంచలనాత్మక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువశక్తిని మేల్కొల్పే దిశగా జూన్ 2 ను నిర్వహించే రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుందని కావున ఈ యొక్క పోటీలో నిజామాబాద్ జిల్లా లో గల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రతి నిరుద్యోగ యువతీ యువకులతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పోటీలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ముందుగా 7661899899 గల నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ వెబ్ లింక్ తో కూడిన ఒక ఎస్.ఎం.ఎస్(ూవీూ) ను పొందుతారని ఆ లింకు ద్వారా వారి వివరాలను అందులో జూన్ 1 వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని ఆయన కోరడం జరిగింది. పోటీలో పాల్గొన్న అభ్యర్థులకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రథమ బహుమతి కింద ల్యాప్ టాప్, ద్వితీయ బహుమతి కింద స్మార్ట్ ఫోన్, తృతీయ బహుమతి కింద ట్యాబ్ లెట్ తోపాటు ప్రతి నియోజకవర్గంలో 40 ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుందని ప్రోత్సాహక బహుమతులలో 10 స్మార్ట్ వాచ్లు, 10 ఇయర్ పాడ్లు, 10 హార్డ్ డ్రైవ్ లు ,10 పవర్ బ్యాంకులు బహుకరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని మహిళా టాపర్లకు ప్రత్యేక బహుమతుల కింద ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా బహుకరించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. కావున నిజామాబాద్ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని పరిధిలో 16 నుండి 35 సంవత్సరాలు గల విద్యార్థిని విద్యార్థులు మరియు యువతీ యువకులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాలని అలాగే క్విజ్ కాంపిటీషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వాటి నివృత్తి కోసం 8142903456 మరియు 8142803456 నెంబర్లకు కాల్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల పరిధిలోగల అభ్యర్థులకు ఇంకా ఏమైనా ఏవైనా సందేహాలు ఉంటే వ్యక్తిగతంగా తనను సంప్రదించవలసినదిగా వేణురాజ్ గారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుయుఐ నాయకులు నిఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 07:54PM