నవ తెలంగాణ -నవీపేట్: వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చాలని వీఆర్ఏ సంఘం మండల అధ్యక్షులు పెంటయ్య శుక్రవారం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట శుక్రారం బైటాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020లో సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన సందర్భంగా ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని లేనియెడల తాము సైతం ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా ప్రకటించారు.ఈ కార్యక్రమంలో నీరడీ లక్ష్మణ్, ప్రభాకర్, రంజిత్, గిరి, భూమయ్య, నరేష్ మరియు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm