- ఈ 15 న వ్యవసాయ కళాశాల బాలికల వసతి గృహం ప్రారంభం...
నవతెలంగాణ - అశ్వారావుపేట
స్థానిక వ్యవసాయ కళాశాలలో బాలికలు వసతి కై నిర్మించిన నూతన భవన సముదాయాన్ని ఈ 15 న ప్రారంభించనున్నారు.ఇందుకోసం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,ఉపరితల రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రానున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఈ భవనం ప్రారంభంలో గతంలో కొన్ని నెలల క్రితం షెడ్యూల్ ఖరారు అయి వాయిదా పడింది. ఈ కళాశాలలో 80 శాతం ఆడపిల్లలు విద్యను అభ్యసించడం తో పాటు ఈ ఏడాదే మరో 80 సీట్లు మంజూరు అయిన నేపద్యం యూనివర్సిటీ నూతన వసతి గృహ సముదాయం నిర్మించింది. ఇప్పటి కే ఈ కళాశాల ప్రాంగణంలో బాలురు కోసం కిన్నెర,బాలికలు కోసం శబరి పేరున రెండు వసతి గృహ భవన సముదాయాలు ఉన్నాయి.వీటికి అదనంగా నూతన భవన సముదాయం అందుబాటులోకి రానున్నది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 08:56PM