నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని మార్చాపురం గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు సోమసాని నారాయణస్వామి కుమారుడి వివాహానికి టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మృతుని కుటుంబానికి 50 కేజీల బియ్యం సహాయం అందించిన అశోక్. అదేవిధంగా గ్రామంలో ఇటీవల మృతి చెందిన దారంగుల కొమురయ్య కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్ ఆర్థిక సహాయంగా అందించారు. కొమురయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని భరోసా కల్పించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా సమన్వయ కమిటీ మరియు కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాంనాయక్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, దరిపెల్లి పెరుమయ్య, మోత్కూరి రాజేశ్వర్ రావు, కుమ్మరికుంట్ల రాజన్న, వెంగల పోశాలు, దరిపెల్లి శశిరేఖ, శాగంటి సంపత్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 08:58PM