నవతెలంగాణ - కంటేశ్వర్
నిజామాబాదు పోలీస్ కమీషనర్ శ్రీ సి. హెచ్. ప్రవీణ్ కుమార్, ఆదేశాల మేరకు ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల రక్షణ కోసం మై ఆటో ఇన్ సేఫ్ కార్యక్రమం పోలీసు పరేడ్ గ్రౌండ్ యందు నిజామాబాదు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎమ్. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. 2019 నుండి తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారిచే ప్రారంభించబడి విజయవంతంగా అమలు చేస్తున్న మై ఆటో ఇన్ సేఫ్ కార్యక్రమంలో నిజామాబాద్ కమిషనరేట్ ఉన్నటువంటి దాదాపు 8000 ఆటో రిక్షాలు మరియు 500 క్యాబ్‌లు రవాణాలో ప్రయాణికులకు మరింత భద్రత మరియు సౌకర్యం అందించడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. పోలీస్ సిబ్బంది ప్రతి ఆటో డ్రైవర్ ను సోదర భావంతో చూడాలని ఆటో డ్రైవర్ కు ప్రయాణికుల దేవుళ్ళని వారి సౌకర్యార్థం చక్కని విధులు నిర్వహించాలని అట్టి ప్రయాణికులకు గమ్యస్థానానికి చేర్చాలని ప్రతి ఆటో డ్రైవర్ పోలీసు యూనిఫామ్ లేని పోలీసు అని,ఆటో డ్రైవర్ మంచి క్రమశిక్షణతో ఉండాలని, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ మంచి ఫలితంతో ఇంటికి వెళ్లాలని, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ మై ఆటో ఇన్ సేఫ్ నిబంధనలు పాటించాలని, మీ రక్షణ కోసం ఏర్పాటు చేశామని దీనికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఉండడం వలన ఎలా ఎవ్వరు ఎలాంటి నేరాలు చేయకుండా కట్టడి చేయడం జరుగుతుందని అన్నారు. ప్రయాణికులు కూడా సురక్షితంగా గమ్యాన్ని చేరుతాము అని నమ్మకం కలుగుతుందని తెలియజేశారు.
ఆటోలో యజమానులు మరియు డ్రైవర్లకు సూచనలు..
ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం. అతివేగం ప్రమాదకరం ముందుగా బయలుదేరు క్షేమంగా గమ్యం చేరు.మద్యం లేదా మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపరాదు.
సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు. పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించవద్దు.డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే వాహనం నడుపు రాదు.డ్రైవర్ల పక్కన ఎవరిని ఎక్కించుకోకూడదు.జాతీయ రహదారిపై ఆటో నడపరాదు.ఆటో డ్రైవర్ లు ఎవ్వరు కూడా గంజాయి అలవాట్లు చేసుకోరాదని, గంజాయితో సంబంధాలు పెట్టుకోవద్దని, నేరస్తులకు సహకారం అందించవద్దని, తెలియజేశారు.
పోలీస్ శాఖ పరిధి - నేరాల నివారణ..
పోలీస్ సిబ్బంది ప్రజల రవాణా సమయంలో కలిగే అతి చిన్న సమస్యలను కూడా సులభంగా స్వీకరిస్తారు మరియు నేరాలను నివారించడానికి నివారణ చర్యలుగా అవసరమైన చర్యలు తీసుకుంటారు, ఖచ్చితమైన ఆటోల యజమాన్యాల సమాచారం పోలీసు కేసుల విచారణలో సహాయం చేస్తుంది. ఆటో డ్రైవర్లకు నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా వారిని చైతన్య పరచవచ్చు ట్రాఫిక్ జాములు, అలర్ట్, ప్రమాదాలు మరియు అవగాహన కార్యక్రమాలు వివరాలు వంటి ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని సులభంగా కమ్యూనికేట్ చేయవచ్చు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్టీసీ డిపో -1 డి.ఎం ఆనంద్, డిపో-2, డి.ఎం వెంకటేష్ , నిజామాబాద్ ట్రాఫిక్ సి.ఐ శ్రీ చందర్ రాథోడ్, టౌన్ వన్ ఎస్.హెచ్.ఓ , విజయబాబు , టౌన్ సి,ఐ శ్రీ వెంకట నారాయణ టౌన్ -1, టౌన్ -2, టౌన్ -3, టౌన్ -4 ,ఎస్.ఐ.పీలు, ట్రాఫిక్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 03:46PM