- డిటిఎస్ నాయకుల డిమాండ్
నవతెలంగాణ - కంటేశ్వర్
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 16 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం,వారి సమస్యలు పరిష్కరించకుండా, వారు విధులలో శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు చేరనిచో ఉద్యోగం నుండి తొలగిస్తామనడం అప్రజాస్వామికమని, అట్టి చర్యలను డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డిటిఎఫ్) తీవ్రంగా ఖండింస్తుంది అని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శంతన్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రాజన్న అన్నారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సమ్మెలో పాల్గొన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె శిబిరంను ఉద్దేశించి డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపా ధ్యక్షులు, పి. శంతన్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రాజన్న మాట్లాడడం జరిగింది. జూనియర్ పంచాయితీ కార్యదర్శుల నియామకానికి,నోటిఫికేషన్ ఇచ్చి పోటీ పరీక్ష ద్వారా ఎంపిక కాబడిన అభ్యర్థులకు వారిని ఉద్యోగంలోకి తీసుకునే ముందు సంఘాలలో చేరకూడదని, సమ్మెలు చేయమని హామీ తీసుకోవడం రెగ్యులర్ చేయమని అడుగకూడదని, ఇలా అనేక షరతులతో నియమించడం ప్రభుత్వం యొక్క అప్రజాస్వామ్య వైఖరిని తెలుపుతుoది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ప్రభుత్వo వ్యవహరించడం శోచనీయం, దేశ అత్యున్నత న్యాయస్థానం అనేక సందర్భాల్లో సమన పనికి సమాన వేతనం చెల్లించాలని ఇచ్చిన అనేక తీర్పులను కనీసంగా పరిగణలోకి తీసుకోకపోవడం, ఇది ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమే అన్నారు. వారు నియామకమై నాలుగు సంవత్సరాలు గడిచిపోయినప్పటికి వారిని రెగ్యులర్ చేయకపోవడం శోచనీయమన్నారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలు దాదాపు 40 ప్రభుత్వ పథకాల అమలులో కీలక భూమిక పోషిస్తున్నoదున వారి శ్రమను గుర్తించి వెంటనే వారిపై బెదిరింపు చర్యలు మానుకొని, వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిటిఎఫ్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 03:50PM