నవతెలంగాణ కంటేశ్వర్
పిసిసి అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు రేవంత్ రెడ్డి గారు యాదవ జాతికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర యాదవ సంఘం మరియు యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేకల రాములు యాదవ్ గొలుసు శ్రీనివాస్ యాదవ్ లు హెచ్చరిక చేయడాన్ని పిసిసి సంయుక్త కార్యదర్శి బాస వేణుగోపాల్ యాదవ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విక్కీ యాదవ్ కురుమ సంఘం నాయకుడు మహేష్ కురుమ లు తీవ్రంగా ఖండించారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. అసలు పశువర్ధన శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాను మంత్రినని మర్చిపోయి తలకాయ లేని మంత్రిగా రేవంత్ రెడ్డి ని బక్కోడ పొట్టోడ పీక పిసికేస్త అంటూ ఒక పార్లమెంట్ సభ్యుడు దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మీరు సమర్థిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాము అసలు సమస్యను మొదలు పెట్టినటువంటి వ్యక్తి శ్రీనివాస్ యాదవ్. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడిన మాటలకు కౌంటర్‌గా రేవంత్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్ ని దున్నపోతు అనుకుంటున్నాడేమో పెండను పిసికినట్లు రేవంత్ రెడ్డి పీక పిసుకుతావ గాలికి దొరికిందా నా పీక అంటూ రేవంత్ రెడ్డి గారు జవాబు ఇవ్వడం జరిగింది. దానికి కూడా శ్రీనివాస్ యాదవ్ నేను మాట్లాడిన మాటలను ఉపసహరించుకుంటున్నానని అలా మాట్లాడవలసిన కాదని స్పష్టం చేయడం జరిగింది. కానీ కెసిఆర్ కేటీఆర్ రాజకీయ కుట్రలో భాగంగా సమస్యను రాజకీయ కుట్రగా మార్చి సమస్యను కులానికి అంటబెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారు అసలు వ్యక్తికి వ్యక్తికి మధ్య జరిగిన సమస్యను కులానికి ముడి పెట్టి రాజకీయ రంగు పూస్తున్న ఘనత శ్రీనివాస్ యాదవ్ కి దక్కుతుంది కుల బాంధవులు జరిగిన సంఘటనలు సమస్యను సమక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది గొర్రెలను బర్రెలు ఇస్తూ యాదవులు మోసం చేస్తున్నా కేసిఆర్ ను ఆయన బానిస శ్రీనివాస్ యాదవ్ ఉచ్చులో పడి నిర్ణయాలు తీసుకోవద్దని రేవంత్ రెడ్డి ని యాదవ ద్రోహిగా చిత్రకరించే ప్రయత్నాలు చెల్లవని, కాబట్టి రేవంత్ రెడ్డిగారు క్షమాపణ చెప్పడని స్పష్టం చేస్తున్నాం. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ లోని యాదవ కురుమ సంఘం నాయకులు బాసటగా అండగా ఉంటారని స్పష్టం చేస్తున్నాము. జరిగిన రాజకీయాలను పక్కనపెట్టి మీకు చేతనైతే ఏ విచారణ లేకుండా ఎంఐఎం ఒత్తిడి మేరకు జగిత్యాల ఎస్సై అయిన అనిల్ యాదవ్ సస్పెండ్ చేశారని సస్పెండ్ ఎత్తివేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాము మొదట ఆ సమస్యను పరిష్కరించుకుందాము అని పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేంద్ర గౌడ్, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, శోభన్, వినోద్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 05:14PM