నవతెలంగాణ - గోవిందరావుపేట
ధాన్యంలో కోత విధిస్తున్న మిల్లు యాజమాన్యం గణనీయంగా తగ్గిన దిగుబడులు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులపై పెను ఆర్థిక భారం పడుతుంది. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్ కు 2060 రూపాయలు కామన్ రకాలకు 2040 చెల్లిస్తుండగా వీటిలో క్వింటాలకు దాన్యం కాంటా పెట్టి లోడు వేసినందుకు హమాలీలకు రైతులు క్వింటాలుకు 50 రూపాయలు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా తాడిపత్రి కడితే 500 రూపాయలు లారీకి రైతులే చెల్లించాలి. అదీకాక రైస్ మిల్లులో ధాన్యం దిగుమతి అయిన తర్వాత లారీ బాడీలో నిల్వ ఉన్న ధాన్యాన్ని కిందకు ఓడ్చినందుకు లారీకి 200 హమాలీలకు రైతులే చెల్లించాలని ఈ ప్రకారంగా కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు రైతుల నుండి డబ్బులను వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన సుమారు క్వింటాలుకు 60 రూపాయలు రైతు చెల్లిస్తున్నాడు. క్వింటాలుకు రెండు కిలోల వరకు మిల్లు యాజమాన్యం తరుగు పేరుతో కట్ చేస్తుంది. గత వర్షాకాలం ఎలాంటి కటింగు లేకుండా దిగుమతి చేసుకున్న మిల్లు యాజమాన్యం రభి లో తన పందాను మార్చుకుంది. కటింగ్ తోనే లాభాలు అన్న విషయం దృష్టిలో పెట్టుకొని చిన్నగా కటింగ్ లను స్టార్ట్ చేసింది. ఈ లెక్కన క్వింటాలుకు మరో 40 రూపాయలను రైతు నష్టపోతున్నాడు. టోటల్‌గా రైతు క్వింటాలకు వంద రూపాయలను కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించి కోల్పోతున్నాడు ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. అంటే ప్రభుత్వం ఇప్పుడు క్వింటాలుకు చెల్లిస్తున్న ధర 1960 రూపాయలు ఏ గ్రేడ్ 1940 కామన్ గ్రేడ్ రైతుకు వర్తిస్తుంది.
ఎం టి యు వెయ్యి పది రకాన్ని కామన్ గా తీసుకుంటున్నారు.
కాటన్ దొర సన్నాలుగా చెప్పుకునే 1010 పది రకాన్ని ఇప్పుడు మిల్లర్లు కామన్ రకంగా స్వీకరిస్తున్నారు.
తాతల కాలం నుండి ఈ రకాన్ని ఏ గ్రేడ్‌గా స్వీకరించిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం కామన్ రకంగా రైస్ మిల్లర్లు తీసుకుంటున్న కిక్కురు మనకుండా ఉంటున్నారు. అంతేకాకుండా టెక్నికల్ టీం కూడా దీనిని కామన్ గానే పరిగణించాలని మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం ప్రకటించడం రైతును కోలుకోలేని దెబ్బతీసింది. ఏ రకం ధాన్యాన్ని అయినా రైతు నాటక ముందే ఆ రకం ధాన్యాన్ని ప్రభుత్వం ఎలా ఏ రకం క్రింద ఖరీదు చేస్తుందో పేర్కొంటుంది. పంటకాలం పూర్తి అయినా తరువాత ఖరీదుల సమయంలో వెయ్యి పది రకాన్ని కామన్ వెరైటీగా పేర్కొనడం సమంజసం కాదని రైతులు అంటున్నారు.
దిగుబడులు గణనీయంగా తగ్గాయి బెల్లం సౌందర్య మహిళ రైతు చల్వాయి
వడగళ్ల వాన అకాల వర్షాల వల్ల ఈసారి దిగుబడును గణనీయంగా తగ్గాయి. ఎగరానికి 20 కింటాల ధాన్యం కూడా వెళ్లడం లేదు. ఈ సమయంలో వెయ్యి పది రకాన్ని కామన్ గా ప్రకటించడం విచారకరం. అంతేకాక క్వింటాలకు 60 రూపాయలు హమాలి రెండు కేజీల కటింగ్ ద్వారా 40 రూపాయలు కామన్ గా ప్రకటించడం వల్ల మరో 20 రూపాయలు రైతులు నష్టపోతున్నారు. ఇంకా ధాన్యం కంటాలు వేసిన కుట్టడానికి సుతిలి దారం కోసిన ధాన్యాన్ని సుమారు ఐదు రోజులపాటు పట్టాల కింద ఆరబోసిన పట్టాల కిరాయి ఇవన్నీ కలిపి ఎకరానికి సుమారు 3000 పైబడి ఖర్చు వస్తుంది. రైతు బాగుపడే కాలం ఎప్పుడో పోయింది గతిలేక వ్యవసాయం చేస్తున్నాం. ప్రభుత్వాలు రైతుల పరిస్థితిని గమనించి అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను రూపొందించాలి.
2. రభీ లో లాభాలు వస్తాయనుకుంటే నష్టాలు మిగులుతున్నాయి. పెద్దాపురం ఓదెలు రైతు
వర్షాకాలంలో తెగుళ్లు చీడపీడలు వర్షాల వల్ల దిగుబడులు తగ్గగా ఈసారి రబీలో వడగళ్ల వానలు అకాల వర్షాలు రభీ వంటను నాశనం చేశాయి. రవిలో దాన్యం అధికంగా పండి దిగుబడి అధికంగా వస్తుంది మంచి లాభం వస్తుంది అనుకుంటే ఆశ నిరాశ అయింది. ప్రభుత్వం పట్ట నష్టపరిహారం సర్వే చేసిన పరిహారం రాకపోవడం రైతులను మరింత కొంగదీసింది. గతంలో ప్రభుత్వం ఎంతోకొంత పరిహారం అందించేది. గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి పరిహారం పంటలకు అందించకపోవడం బాధాకరం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 05:51PM