- కాటాపూర్ లో ఘనంగా హనుమాన్ నగర సంకీర్తన
నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలోని కాటాపురంలో అంజన్న స్వామి భక్తులు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ మాల ధారణ చేసి ప్రతిరోజు భజన కీర్తనలు, భజనలు గ్రామస్తులను రామాలయం వద్ద ఆకట్టుకున్నాయి. గ్రామంలోని వారందరూ పాడి పంటలతో పిల్లాపాపలతో దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అన్నారం పెద్ద చెరువు వద్ద అంజన్న స్వామి ఆలయం వద్ద కాటాపూర్లోని రామాలయం వద్ద ప్రతిరోజు నిత్య పూజలు నిర్వహించారు. చివరి రోజు కావడంతో గ్రామంలోని అన్ని వీధుల ఇరుముడి వేసుకొని సంకీర్తనలు పాడుకుంటూ జైశ్రీరామ్.. జై హనుమాన్ అంటూ జయ జయ ధనులతో కాటాపుర్ మార్మోగింది. భజనలు వేసుకుంటూ భద్రాచలం పుణ్యక్షేత్రానికి బయలుదేరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 06:00PM