- చెన్నకేశవరావు, సత్యనారాయణ చౌదరి వర్గాలుగా పార్టీ శ్రేణులు
- కనువిప్పు కలగని నాయకులు
నవతెలంగాణ - అశ్వారావుపేట
కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వచ్చాయని,అందుకే కర్నాటకలో గెలుపు సాధ్యం అయిందని జాతీయ నేతలు,కర్నాటక నాయకులు చెప్తున్నప్పటికీ తెలంగాణాలో స్థానిక నాయకులకు కనువిప్పు కలగడం లేదేమో అనిపిస్తుంది. శనివారం కర్నాటక విజయం సంబురాలు సైతం అశ్వారావుపేట లో కలిసికట్టుగా కాకుండా వేర్వేరుగా నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. అశ్వారావుపేట లో మొగుళ్ళపు చెన్నకేశవరావు,జ్యేష్ట సత్యనారాయణ వర్గాలు చీలి ఈ సంబరాలు నిర్వహించారు. చెన్నకేశవరావు నేతృత్వంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి బాణసంచా పేల్చారు.అనంతరం కార్యాలయం నుండి స్థానిక మూడు రోడ్ల కూడలిలో గల మాజీ ముఖ్యమంత్రి,దివంగత కాంగ్రెస్ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించారు.తర్వాత గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న వీవోఏ లకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. సమ్మె చేస్తున్న వారికి బత్తాయి రసం విరాళంగా ఇప్పించారు.ఈయన వెంట ఎం.పి.టి.సి లు వేముల భారతి,సత్యవరపు తిరుమల బాలగంగాధర్,కో - ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా లు పాల్గొన్నారు. జ్యేష్ట సత్యనారాయణ చౌదరి నేతృత్వంలో తన ఇంటి నుండి రిలయన్స్ స్మార్ట్ వరకు ర్యాలీ చేసి అదే ప్రాంగణంలో స్వీట్లు పంచి,బాణసంచా కాల్చి కాంగ్రెస్ విజయం నినాదాలు చేసారు. ఈయన వెంట అశ్వారావుపేట మండల పరిషత్, పిఎసిఎస్ పూర్వ ఉపాధ్యక్షులు సుంకవల్లి వీరభద్రరావు,జెడ్.పి.టి.సి పూర్వ సభ్యులు అంకత మల్లికార్జున్ రావు లు ఉన్నారు. ఈ చెన్నకేశవరావు,సత్యనారాయణ చౌదరి లు ఒకే సామాజిక వర్గం నాయకులు కావడం మరో విశేషం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 06:05PM