- 15 న హుస్నాబాద్ లో జరిగే బహిరంగ సభ
- సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్
నవతెలంగాణ - హుస్నాబాద్ రూరల్
సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు మూడు సంవత్సరాల వ్యవధిలో పూర్తికాగా గౌరెల్లి ప్రాజెక్టు పనులు మాత్రం నత్తనడకగా సాగుతున్నాయని, గౌరవెల్లి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ విమర్శించారు. శనివారం హుస్నాబాద్ లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు హుస్నాబాద్ ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం కాబట్టి 8సార్లు సిపిఐ పార్టీ ఎమ్మెల్యే ను గెలిపించుకున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన వారు కేవలం కమ్యూనిస్టులేనని ఈమధ్య కాలంలో పుట్టుకొచ్చిన బూర్జువా పార్టీలు హుస్నాబాద్ అభివృద్ధిని చేయడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యల పరిస్కారం కోసం ఈ నెల15న హుస్నాబాద్ చేపట్టే భారీ బహిరంగ సభకు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొయ్యడ సృజన్ కుమార్, జేరిపోతుల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 06:20PM