నవతెలంగాణ - అశ్వారావుపేట
గత కొన్ని రోజులుగా జూనియర్ పంచాయితీ కార్యదర్శులు సమ్మె నిర్వహిస్తున్న క్రమంలో మండలంలో ఆసుపాక కార్యదర్శి మోతీలాల్ శనివారం సమ్మె విరమించుకుని విధుల్లో చేరాడు. ఈ సందర్భంగా మోతిలాల్ ను ఎంపిపి శ్రీరామమూర్తి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు తొందరపాటు నిర్ణయంతో కనీసం పంచాయతీ రాజ్ మినిస్టర్ తో గాని ప్రభుత్వంతో గాని ఎటువంటి చర్చలు జరపకుండా ఇలా సమ్మె చేయడం సరికాదని, అతి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను రెగ్యులైజేషన్ చేస్తుందనీ కావున ప్రతి ఒక్క కార్యదర్శి సమ్మె విరమించి తిరిగి వీధుల్లో చేరాలని కోరారు. ప్రభుత్వం మిమ్మలని మీరు చేసే సేవలను గుర్తించింది కాబట్టే జీతాలను పెంచిందని, విధుల్లో చేరి గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.డి.ఒ శ్రీనివాస రావు,ఎం.పి.ఇ.ఒ సీతారామరాజు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 06:22PM